శుక్రవారం 10 జూలై 2020
Sports - May 04, 2020 , 01:44:17

ఈ నెలాఖరు నుంచి క్రీడా క్యాంప్‌లు

ఈ నెలాఖరు నుంచి క్రీడా క్యాంప్‌లు

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగబోయే అథ్లెట్ల కోసం ఈనెలాఖరులో జాతీయ క్యాంప్‌లు తిరిగి పునరుద్ధరిస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం శిక్షణ లేకుండా ఇండ్లకే పరిమితమైన అథ్లెట్ల కోసం ఈ క్యాంప్‌లు ఉపయోగపడుతాయని మంత్రి పేర్కొన్నారు. కొవిడ్‌-19 వ్యాప్తిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 17 వరకు లాక్‌డౌన్‌ పొడిగించడంతో జాతీయ క్యాంప్‌ల నిర్వాహణ ఆలస్యమవుతున్నదని ఆయన తెలిపారు. 


logo