లీడ్స్: డానియల్ జార్విస్..అలియాస్ జార్వో69పై తాత్కాలిక నిషేధం పడింది. ఇంగ్లండ్‌తో లార్డ్స్, లీడ్స్‌లో జరిగిన రెండు టెస్టుల్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు టీమ్ఇండియా జెర్సీలో జార్వో ఆటకు అంతరాయం కల్గించిన సంగతి తెలిసిందే. పోలీసుల కండ్లు గప్పి మైదానంలోకి ప్రవేశించిన జార్వో చర్యను సిరీయస్‌గా తీసుకున్న యార్క్‌షైర్ కౌంటీ యాజమాన్యం జరిమానాతో పాటు హెడింగ్లే స్టేడియంలో ప్రవేశంపై జీవితకాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. యూట్యూబర్‌గా పేరొందిన జార్విస్ భారత జెర్సీ ధరించి వార్తల్లో వ్యక్తిగా మారాడు. ముఖ్యంగా సోషల్‌మీడియాలో పాపులర్ అయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వేటు ఎదుర్కొవాల్సి వచ్చింది. ‘హెడింగ్లేలో ప్రవేశంపై జార్వోపై జీవిత కాల సస్పెన్షన్ విధించాం. దీనికి తోడు జరిమానా కూడా వేస్తాం’ అని యార్క్‌షైర్ అధికార ప్రతినిధి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.