బుధవారం 27 జనవరి 2021
Sports - Dec 13, 2020 , 20:28:03

భారత్‌-ఆస్ట్రేలియా సన్నాహక మ్యాచ్‌ డ్రా

భారత్‌-ఆస్ట్రేలియా సన్నాహక మ్యాచ్‌ డ్రా

సిడ్నీ: భారత్‌, ఆస్ట్రేలియా-ఏ రెండో సన్నాహక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. డే-నైట్‌ వామప్‌ మ్యాచ్‌ను భారత బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు.  కంగారు గడ్డపై ప్రతిష్ఠాత్మక టెస్టు సిరీస్‌కు  మొత్తంగా టీమ్‌ఇండియాకు మంచి ప్రాక్టీస్‌ లభించింది. ఇక తుది జట్టు కూర్పుపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ దృష్టిసారించనుంది. యువ ఓపెనర్‌ పృథ్వీ షా మినహా బ్యాట్స్‌మన్‌ మంచి జోరు కనబర్చడంతో తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో ఆసక్తికరంగా మారింది.   నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ డిసెంబర్‌ 17 నుంచి అడిలైడ్‌ వేదికగా ప్రారంభంకానుంది.  

మ్యాచ్‌ స్కోర్లు:

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 194 

ఆస్ట్రేలియా-ఏ తొలి ఇన్నింగ్స్: 108

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌:  386/4 డిక్లేర్డ్

ఆస్ట్రేలియా-ఏ రెండో  ఇన్నింగ్స్: 307/4


logo