ఆదివారం 05 జూలై 2020
Sports - May 12, 2020 , 16:01:26

అండ‌ర్స‌న్‌, బ్రాడ్ త‌ర్వాత ఎవ‌రు?

అండ‌ర్స‌న్‌, బ్రాడ్ త‌ర్వాత ఎవ‌రు?

ప్ర‌త్యామ్నాయాల‌పై దృష్టిసారించాలంటున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీట‌ర్స‌న్‌

లండ‌న్‌:  సీనియ‌ర్ పేస‌ర్లు జేమ్స్ అండ‌ర్స‌న్‌, స్టువ‌ర్ట్ బ్రాడ్ రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తే.. ఇంగ్లండ్ టెస్టు జ‌ట్టు డీలాప‌డే ప్ర‌మాదం ఉందని ఆ దేశ మాజీ కెప్టెన్ కెవిన్ పీట‌ర్స‌న్ అభిప్రాయప‌డ్డాడు. టెస్టు క్రికెట్‌లో వీరిద్ద‌రి పాత్ర ప్ర‌ముఖ‌మైన‌ద‌ని.. 20 వికెట్లు తీయ‌గ‌లిగే వ‌న‌రులు లేక‌పోతే టెస్టులు నెగ్గ‌డం అసాధ్య‌మ‌ని పీట‌ర్స‌న్ పేర్కొన్నాడు. కెరీర్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ ఇద్ద‌రికి త‌గిన ప్ర‌త్యామ్నాయాల‌ను వెత‌కాల్సిన బాధ్య‌త ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుదే అని అత‌డు అన్నాడు.

`అండ‌ర్స‌న్‌, బ్రాడ్ కెరీర్ చివ‌రి ద‌శ‌లో ఉన్నారు. అలాంటి ఇద్ద‌రు సీనియ‌ర్ పేసర్లు జ‌ట్టుకు దూర‌మైతే ప‌రిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది. వారి ప్ర‌త్యామ్నాయాలు సిద్ధం చేయాల్సిన బాధ్య‌త బోర్డుదే. 20 వికెట్లు ప‌డ‌గొట్ట‌లేక‌పోతే టెస్టుల్లో విజ‌యాలు సాధ్యం కావు. ప్ర‌స్తుతానికి మార్క్ వుడ్ అందుబాటులో ఉన్నా.. అత‌డు గాయాల‌తో స‌హ‌వాసం చేస్తున్నాడు. జొఫ్రా ఆర్చ‌ర్ ప‌రిస్థితి కూడా అదే. దక్షిణాఫ్రికాతో సిరీస్ సంద‌ర్భంగా అత‌డు కూడా గాయ‌ప‌డ్డాడు` అని పీట‌ర్స‌న్ చెప్పుకొచ్చాడు. గ‌త కొన్నాళ్లుగా బెన్ స్టోక్స్ అద్వితీయ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడ‌ని కేపీ అన్నాడు.


logo