సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Sep 07, 2020 , 01:57:23

నయా విజేత

నయా విజేత

  • ఇటాలియన్‌ గ్రాండ్‌ప్రి గాస్లీ కైవసం 

మోంజా:  ఫార్ములా వన్‌ రేసింగ్‌లో అల్ఫాతౌరి డ్రైవర్‌ పిరే గాస్లీ కొత్త విజేతగా అవతరించాడు. ఆదివారం ఇక్కడ ఉత్కంఠ భరితంగా జరిగిన ఇటాలియన్‌ గ్రాండ్‌ప్రిలో స్టార్‌ రేసర్లను వెనక్కి నెట్టి అతడు టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. ఫ్రెంచ్‌ రేసర్‌ గాస్లీకి ఇది తొలి ఫార్ములావన్‌ టైటిల్‌. పోల్‌ పొజిషన్‌ నుంచి రేస్‌ ఆరంభించిన ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ పది సెకన్ల పెనాల్టీకి గురై ఏడో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. గాస్లీ కంటే 0.415ఏడు సెకన్లు ఆలస్యంగా లక్ష్యాన్ని చేరిన మెక్‌లారెన్‌ డ్రైవర్‌ కార్లోస్‌ సైన్జ్‌ రెండో స్థానంలో నిలువగా, లాన్స్‌ స్ట్రోల్‌ మూడో ప్లేస్‌ దక్కించుకున్నాడు. ఇంతకు ముందు ఒక్క ఫార్ములావన్‌ టైటిల్‌ కూడా గెలువని ముగ్గురు  ఈ రేస్‌ టాప్‌-3లో నిలువడం విశేషం. 


logo