శనివారం 23 జనవరి 2021
Sports - Nov 30, 2020 , 00:15:52

ఫిలిప్స్‌ రికార్డు సెంచరీ

ఫిలిప్స్‌ రికార్డు సెంచరీ

  • రెండో టీ20లో విండీస్‌పై కివీస్‌ జయభేరి

మౌంట్‌మాంగనీ: గ్లెన్‌ డొమినిక్‌ ఫిలిప్స్‌ (51 బంతుల్లో 108; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) రికార్డు సెంచరీతో వీరవిహారం చేయడంతో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్‌ 72 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్‌ 2-0తో చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన పోరులో మొదట బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగు లు చేసింది. ఫిలిప్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగితే.. కాన్వే (37 బంతుల్లో 65 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), గప్టిల్‌ (34) రాణించారు. పొట్టి ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌ తరఫున వేగవంతమైన శతకం (46 బంతుల్లో) నమోదు చేసిన ఆటగాడిగా ఫిలిప్స్‌ రికార్డుల్లోకెక్కాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో విండీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 166 పరుగులే చేసింది. పొలార్డ్‌ (28) టాప్‌ స్కోరర్‌. 


logo