e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News చ‌రిత్ర సృష్టించిన‌ గోల్ఫ్ ప్లేయ‌ర్‌ ఫిల్ మికెల్స‌న్..

చ‌రిత్ర సృష్టించిన‌ గోల్ఫ్ ప్లేయ‌ర్‌ ఫిల్ మికెల్స‌న్..

చ‌రిత్ర సృష్టించిన‌ గోల్ఫ్ ప్లేయ‌ర్‌ ఫిల్ మికెల్స‌న్..

కైవా ఐల్యాండ్: గోల్ఫ్ ప్లేయ‌ర్ ఫిల్ మికెల్స‌న్ చ‌రిత్ర సృష్టించాడు. 50 ఏళ్ల వ‌య‌సులో అమెరికా పీజీఏ గోల్ప్ చాంపియ‌న్‌షిప్‌ను గెలుచుకున్నాడు. పీజీఏ టైటిల్‌ను 50 ఏళ్ల వ‌య‌సులో గెలుచుకున్న తొలిప్లేయ‌ర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. మికెల్స‌న్ కెరీర్‌లో అత‌నికి ఇది ఆర‌వ మేజ‌ర్ టైటిల్ కావ‌డం విశేషం. 2013లో బ్రిటీష్ ఓపెన్ నెగ్గిన త‌ర్వాత ఆయ‌న‌కు ఇదే తొలి టైటిల్‌. 1968లో పీజీఏ చాంపియ‌న్‌షిప్‌ను జూలియ‌స్ బోర‌స్ అనే ప్లేయ‌ర్ 48 ఏళ్ల వ‌య‌సులో గెలిచాడు. టోర్నీ ఫైన‌ల్ రోజు ఆట‌ను తిల‌కించేందుకు భారీ సంఖ్య‌లో ప్రేక్ష‌కులు కైవా ఐల్యాండ్‌కు చేరుకున్నారు. వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న అమెరికా ఓపెన్ టోర్నీలో ఫిల్ మికెల్స‌న్ ఫెవ‌రేట్‌గా బ‌రిలోకి దిగ‌నున్నారు. మికెల్స‌న్ విజ‌యం ప‌ట్ల మేటి గోల్ఫ్ ప్లేయ‌ర్ టైగ‌ర్ వుడ్స్ రియాక్ట్ అయ్యారు. మికెల్స‌న్‌కు కంగ్రాట్స్ చెప్పిన టైగ‌ర్‌.. 50 ఏళ్ల వ‌య‌సులో చాంపియ‌న్‌షిప్ గెల‌వ‌డం నిజంగా అద్భుత‌మ‌న్నాడు. ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో టైగ‌ర్ వుడ్స్‌కు గాయాలైన విష‌యం తెలిసిందే. దీంతో అత‌ను గోల్ఫ్ టోర్నీల‌కు దూరంగా ఉన్నాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చ‌రిత్ర సృష్టించిన‌ గోల్ఫ్ ప్లేయ‌ర్‌ ఫిల్ మికెల్స‌న్..

ట్రెండింగ్‌

Advertisement