శుక్రవారం 22 జనవరి 2021
Sports - Jan 07, 2021 , 00:25:58

ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యం

ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యం

  • హెచ్‌ఎఫ్‌ఐ చీఫ్‌ జగన్‌మోహన్‌ రావు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: ఒలింపిక్స్‌లో భారత్‌ స్వర్ణం సాధించాలనేదే తమ లక్ష్యమని జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్య(హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు అన్నారు. దీని కోసం దేశంలోని రాష్ర్టాలన్నీ టీమ్‌ఇండియాలా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ప్రతిభావంతులైన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. జగన్‌మోహన్‌రావును పంజాబ్‌ హ్యాండ్‌బాల్‌ సంఘం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడు ఆనందీశ్వర్‌పాండే, పంజాబ్‌ ప్రతినిధులు ప్రీత్‌పాల్‌సింగ్‌, వినయ్‌ కుమార్‌, అమన్‌బీర్‌సింగ్‌ పాల్గొన్నారు. 


logo