ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 05, 2020 , 18:13:13

ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్‌ చేరుకున్న పెట్రా క్విటోవా

ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్‌ చేరుకున్న పెట్రా క్విటోవా

పారిస్‌ : రెండుసార్లు వింబుల్డన్ ఛాంపియన్‌గా నిలిచిన పెట్రా క్విటోవా 2020 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరింది. గత ఎనిమిదేండ్లలో క్వార్టర్స్‌కు చేరడం ఇదే తొలిసారి. 6-2, 6-4 తేడాతో చైనా టెన్నీస్‌ క్రీడాకారిణి ఝాంగ్‌ షుయ్‌ను ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఏడవ సీడ్ చెక్ క్రీడాకారిణి 2012 లో రోలాండ్ గారోస్‌లో జరిగిన తన ఏకైక సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. మొదటి సెట్‌లో 5-2తో వెనుకబడి ఉండగా ఝాంగ్‌ షుయ్‌కు వైద్య సహాయం కోసం మ్యాచ్‌ను నిలుపాల్సి వచ్చింది.

కోర్ట్ ఫిలిప్ చాట్రియర్‌లోని చల్లటి పరిస్థితులను ఎదుర్కోవటానికి క్విటోవా పింక్ కోటు ధరించి వచ్చారు. మ్యాచుకు ముందు శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవనికి కొన్ని వ్యాయామాలు కూడా చేసింది. 30 ఏండ్ల వయసున్న పెట్రా  క్విటోవా తదుపరి మ్యాచులో లారా సీజ్‌మండ్‌తో తలపడనున్నది. అన్‌సీడెడ్ జర్మన్ క్రీడాకారిణి లారా సీజ్‌మండ్‌ 7-5, 6-2తో పౌలా బడోసాను ఓడించి తొలిసారిగా ప్రధాన టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నది.

రోజుకు 1,000 మంది ప్రేక్షకుల పరిమితి దాటకుండా చూడాలని పారిస్ పోలీసులు నిర్ణయించిన తరువాత.. ఫ్రెంచ్ ఓపెన్ చివరి వారంలో ఇంకా రద్దీ ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తిని నెమ్మదిగా తగ్గించే కొత్త చర్యల్లో భాగంగా ప్యారిస్‌లోని బార్లు మంగళవారం నుంచి రెండు వారాలపాటు మూసివేయించనున్నట్లు పారిస్ పోలీసు చీఫ్ డిడియర్ లాలెమెంట్ తెలిపారు. అయితే పారిస్‌లో జరిగిన క్రీడా కార్యక్రమాలలో 1,000 మంది ప్రేక్షకుల పరిమితిని కొనసాగించడం పట్ల విమర్శలు ఎదుర్కొంటున్నాడు.