సోమవారం 13 జూలై 2020
Sports - May 24, 2020 , 18:22:03

కోహ్లీ, రోహిత్‌కు అది మేలు చేసింది: యూనిస్‌ ఖాన్‌

కోహ్లీ, రోహిత్‌కు అది మేలు చేసింది: యూనిస్‌ ఖాన్‌

న్యూఢిల్లీ: కెరీర్‌ తొలినాళ్లలో సచిన్‌ టెండూల్కర్‌ వంటి దిగ్గజ ఆటగాడు జట్టులో ఉండటం విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలకు బాగా ఉపకరించిందని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ యూనిస్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. మ్యాచ్‌కు ముందు అతడు ఎలా సిద్ధమవుతాడు, 30, 40 స్కోర్లను ఎలా శతకాలుగా మారుస్తాడు అనే అంశాన్ని దగ్గరగా చూసే చాన్స్‌ వారికి దక్కిందని యూనిస్‌ చెప్పాడు. ‘భారత క్రికెట్‌ను పరిశీలిస్తే.. విరాట్‌, రోహిత్‌ కెరీర్‌ ఆరంభించిన సమయంలో సచిన్‌ జట్టులో ఉన్నాడు. టెండూల్కర్‌ లాంటి ఆటగాడు ప్రత్యేకంగా ఏం నేర్పాల్సిన అవసరం లేదు. కేవలం అతడిని చూసే చాలా నేర్చుకోవచ్చు’ అని యూనిస్‌ ఖాన్‌ అన్నాడు. 


అబద్ధాలు చెప్పే అలవాటు తనకు లేదని చిన్నప్పటి నుంచి తన తండ్రి అదే విషయం నేర్పించారని యూనిస్‌ గుర్తు చేసుకున్నాడు. ‘2009 ప్రాంతంలో జట్టులో చీలికలు వచ్చాయి. ఆ సమయంలో నా కెప్టెన్సీకి వ్యతిరేకంగా కొందరు ఆటగాళ్లు క్యాంపు రాజకీయాలు చేయడం చూసి తట్టుకోలేకపోయి సారథ్య బాధ్యతలను వదులుకున్నా’ అని యూనిస్‌ పేర్కొన్నాడు. జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లు తాను చెప్పినట్లు వినడం లేదనే కారణంగా యూనిస్‌ ఖాన్‌ కెప్టెన్సీ వదులుకోగా. ఆ సమయంలో ఇతరులు తనను తెలివి తక్కువ దద్దమ్మగా పరిగణించారని కూడా ఖాన్‌ గుర్తుచేసుకున్నాడు.

 


logo