ఆదివారం 05 జూలై 2020
Sports - Apr 19, 2020 , 23:59:35

మీ సేవలకు సలాం

మీ సేవలకు సలాం

న్యూఢిల్లీ: ప్రాణాలను పణంగా పెట్టి కరోనా వైరస్‌పై పోరాడుతున్న వారందరికీ ఫుట్‌బాల్‌ దిగ్గజాలు పీలే, డిగో మారడోన, జిడానేతో పాటు మరికొందరు స్టార్‌ ప్లేయర్లు అభినందనలు తెలిపారు. మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు చప్పట్లు కొడుతూ సంఘీభావం తెలుపుతున్న వీడియోను ఫిఫా ఆదివారం ట్వీట్‌ చేసింది. కరోనాపై యుద్ధం చేస్తున్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు మిగిలిన ఉద్యోగులందరూ నిజమైన హీరోలు అంటూ కీర్తించింది. వారి సేవలను ఫుట్‌బాల్‌ ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొంది. భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్‌ బైచింగ్‌ భూటియా కూడా ఈ వీడియోలో పాలుపంచుకున్నాడు. 


logo