గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 20, 2020 , 12:22:01

క్రికెట‌ర్ ఉమ‌ర్ అక్మ‌ల్‌పై స‌స్పెన్ష‌న్‌

క్రికెట‌ర్ ఉమ‌ర్ అక్మ‌ల్‌పై స‌స్పెన్ష‌న్‌

హైద‌రాబాద్‌:  క్రికెట‌ర్ ఉమ‌ర్ అక్మ‌ల్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స‌స్పెన్ష‌న్ విధించింది. ఉమ‌ర్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ ఆడ‌కూడ‌దంటూ పాక్ క్రికెట్ బోర్డుకు చెందిన అవినీతి నిరోధ‌క శాఖ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.  పీసీబీలోని 4.7.1 ఆర్టిక‌ల్ కింద క్రికెట‌ర్‌పై ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.  నేటి నుంచి పాకిస్థాన్‌లో సూప‌ర్ లీగ్ స్టార్ట్‌ కానున్న‌ది.  క్వెట్టా గ్లేడియేట‌ర్ల త‌ర‌పున ఉమ‌ర్ అక్మ‌ల్ ఆడేవాడు. అయితే అత‌ని స్థానంలో మ‌రో ప్లేయ‌ర్‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు అంటూ ఆ టీమ్‌కు పీసీబీ తెలియ‌జేసింది. గ‌త ఏడాది గ్లాడియేట‌ర్స్ జ‌ట్టు.. పాక్ లీగ్‌లో విజేత‌గా నిలిచింది. ఉమ‌ర్ సోద‌రుడు క‌మ్రాన్ అక్మ‌ల్ కూడా పాకిస్థాన్ జాతీయ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఉమ‌ర్ ప్ర‌వ‌ర్త‌న స‌రిగాలేద‌న్న ఆరోప‌ణ‌ల‌పైన కూడా విచార‌ణ జ‌రుగుతున్న‌ది. జాతీయ క్రికెట్ అకాడ‌మీలో ఫిట్‌నెస్ ప‌రీక్ష స‌మ‌యంలో అక్క‌డ సిబ్బందితో దురుస‌గా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ఉమ‌ర్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  స్కిన్ ఫోల్డ్ ప‌రీక్ష స‌మ‌యంలో అత‌ను అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు తెలుస్తోంది.


logo
>>>>>>