సోమవారం 06 జూలై 2020
Sports - Apr 28, 2020 , 01:37:08

ఉమర్‌ అక్మల్‌పై మూడేండ్ల నిషేధం

ఉమర్‌ అక్మల్‌పై మూడేండ్ల నిషేధం

 లాహోర్‌: వివాదాస్పద బ్యాట్స్‌మన్‌ ఉమర్‌ అక్మల్‌పై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) వేటు వేసింది. ఫిక్సింగ్‌ సంప్రదింపులపై ఫిర్యాదు చేయలేదని రుజువు అవడంతో ఉమర్‌ను అన్ని రకాల క్రికెట్‌ పోటీల నుంచి మూడేండ్ల పాటు నిషేధిస్తున్నట్టు పీబీసీ క్రమశిక్షణ విభాగం సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌  (పీఎస్‌ఎల్‌) ప్రారంభమయ్యే కొన్ని గంటల ముందే క్వెటా గ్లాడియేటర్స్‌ ఆటగాడైన ఉమర్‌ అక్మల్‌ను పీసీబీ సస్పెండ్‌ చేసింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం సంప్రదింపులు జరిగినా ఫిర్యాదు చేయలేదని తేల్చిన పీబీసీ అవినీతి నిరోధక విభాగం అతడిపై గత నెల రెండు కేసులను నమోదు చేసింది. అభియోగాలపై నోటీసులు జారీ చేసినా అక్మల్‌ స్పందించలేదు. పాకిస్థాన్‌ తరఫున ఉమర్‌ 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టీ20లు ఆడాడు. 


logo