శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 22, 2020 , 04:17:04

బెంగళూరుకు షాక్‌

బెంగళూరుకు షాక్‌


చెన్నై: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌) ఐదో సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు రాప్టర్స్‌కు నార్త్‌ఈస్టర్న్‌  వారియర్స్‌ షాకిచ్చింది. మంగళవారం ఇక్కడ ఇరు జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో 4-3తేడాతో నార్త్‌ఈస్ట్‌ జట్టు గెలిచింది. మిక్స్‌డబుల్స్‌ మ్యాచ్‌తో బెంగళూరు గెలుపు ఖాతా తెలిచింది. పురుషుల సింగిల్స్‌లో రాప్టర్స్‌ ఆటగాడు బి.సాయిప్రణీత్‌ 14-15, 9-15తో వారియర్స్‌ ప్లేయర్‌ లీ చెక్‌ యూ చేతిలో పరాజయం చెందాడు. అనంతరం ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంపిక చేసుకున్న మహిళల సింగిల్స్‌లో బెంగళూరు ప్లేయర్‌, ప్రపంచ రెండో ర్యాంకర్‌ తైజూ యింగ్‌ గెలిచినా.. ఆ తర్వాత జరిగిన పురుషుల డబుల్స్‌, సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో నార్త్‌ఈస్ట్‌ విజయం సాధించింది. 


logo