గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 06, 2020 , 00:38:01

సింధు గెలిచినా..

సింధు గెలిచినా..
  • పీబీఎల్‌ నుంచి హైదరాబాద్‌ ఔట్‌

హైదరాబాద్‌: స్టార్‌ ప్లేయర్‌, కెప్టెన్‌ పీవీ సింధు విజయం సాధించినా.. తన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఓడిన హైదరాబాద్‌ హంటర్స్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌) ఐదో సీజన్‌ నుంచి నిష్క్రమించింది. బుధవారం ఇక్కడి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన టైలో హంటర్స్‌ 1-2తేడాతో పుణె 7ఏసెస్‌పై ఓడిపోయి.. సెమీస్‌ చేరకుండానే ఔటైపోయింది. తొలుత జరిగిన పురుషుల డబుల్స్‌లో పుణె జోడీ గెలువగా.. ఆ తర్వాత ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంపిక చేసుకున్న పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్‌ ఆటగాడు ప్రియాన్షు రావత్‌ పరాజయం పాలయ్యాడు. ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌, హంటర్స్‌ స్టార్‌ పీవీ సింధు 15-7, 15-8తేడాతో 7ఏసెస్‌ ప్లేయర్‌ రితుపర్ణ దాస్‌పై సునాయాస విజయం సాధించింది. ఆ తర్వాత ప్రత్యర్థి జోడీ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంపిక చేసుకున్న మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఎన్‌.సిక్కిరెడ్డి - వ్లాదిమర్‌ ఇవనోవ్‌ జోడీ గెలువడంతో హైదరాబాద్‌ స్కోర్లను 1-1తో సమం చేయగలిగింది. అయితే ఆ తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్‌లో సౌరభ్‌ వర్మ ఓటమి పాలవడంతో హైదబాద్‌ హంటర్స్‌ 1-2తో ఓడిపోయింది. గురువారం జరిగే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో బెంగళూరు రాప్టర్స్‌, అవధ్‌ వారియర్స్‌ జట్లు తలపడనున్నాయి.


logo
>>>>>>