ఆదివారం 23 ఫిబ్రవరి 2020
సత్తాచాటిన పావని కుమారి

సత్తాచాటిన పావని కుమారి

Feb 15, 2020 , 00:28:52
PRINT
 సత్తాచాటిన పావని కుమారి

న్యూఢిల్లీ: ఆసియా యూత్‌ అండ్‌ జూనియర్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి కేవీఎల్‌ పావని కుమారి అదరగొట్టింది. ఉజ్బెకిస్థాన్‌లో జరుగుతున్న టోర్నీ లో యూత్‌, జూనియర్‌ విభాగాల్లో కలిపి మొత్తం ఆరు పతకాలు ఖాతాలో వేసుకుంది. 45 కేజీల విభాగంలో బరిలో దిగిన పావని స్నాచ్‌లో 66 కేజీల బరువెత్తి రెండు విభాగాల్లో స్వర్ణాలు చేజిక్కించుకోవడంతో పాటు.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 79 కేజీలెత్తి రెండు రజతాలు గెలుచుకుంది. ఓవరాల్‌గా 145 కిలోలతో రెండు విభాగాల్లోనూ రజత పతకాలు సొంతం చేసుకుంది. హకీంపేటలోని స్పోర్ట్స్‌ స్కూల్‌ లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న పావని.. కోచ్‌ మాణిక్యాల రావు వద్ద శిక్షణ పొందుతున్నది. ఆమెతో పాటు మరో భారత లిఫ్టర్‌ హర్షద (45 కేజీలు) ఐదు క్యాంస్యాలు నెగ్గడంతో టోర్నీ తొలి రోజే భారత్‌ ఖాతాలో 11 పతకాలు చేరాయి.


logo