బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 25, 2020 , 21:59:27

CSK vs DC : చెన్నై ఓపెనర్లు ఔట్‌

CSK vs DC : చెన్నై ఓపెనర్లు ఔట్‌

దుబాయ్:‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో   మ్యాచ్‌లో  చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్వల్ప స్కోరుకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. ఐదో ఓవర్లో ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ షేన్‌ వాట్సన్‌(14)ను అక్షర్‌ పటేల్‌ పెవిలియన్‌ పంపగా.. నోర్ట్జే వేసిన ఆరో ఓవర్‌ ఆఖరి బంతిని భారీ షాట్‌ ఆడిన మురళీ విజయ్(10)‌ మిడాన్‌లో  రబాడకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఓపెనర్లు విఫలమవడంతో చెన్నైపై ఒత్తిడి పెరిగింది.

ఢిల్లీ బౌలర్లు ధాటిగా బంతులేస్తున్నారు.  8ఓవర్లు ముగిసేసరికి చెన్నై రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. డుప్లెసిస్‌(12), రుతురాజ్‌ గైక్వాడ్‌(4) క్రీజులో ఉన్నారు. అంతకుముందు యువ ఓపెనర్‌ పృథ్వీ షా(64: 43 బంతుల్లో 9ఫోర్లు, సిక్స్‌) మెరుపు అర్ధశతకంతో రాణించడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది.


logo