శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Nov 01, 2020 , 22:02:47

రాజస్థాన్‌ ఢమాల్‌.. 37 పరుగులకే 5 వికెట్లు

రాజస్థాన్‌ ఢమాల్‌.. 37 పరుగులకే  5 వికెట్లు

దుబాయ్:‌  కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో కీలక మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ స్వల్ప స్కోరుకే టాప్‌ ఆర్డర్‌ వికెట్లు చేజార్చుకుంది. పేసర్‌ పాట్‌ కమిన్స్‌ దెబ్బకు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. కమిన్స్‌ పదునైన బంతులతో ప్రత్యర్థిని వణికిస్తున్నాడు. రాబిన్‌ ఉతప్ప(6), బెన్‌స్టోక్స్‌(18), స్టీవ్‌ స్మిత్(4)‌లను కమిన్స్‌ ఔట్‌ చేసి మ్యాచ్‌ను కోల్‌కతా వైపు తిప్పాడు.   5 ఓవర్లకు రాజస్థాన్‌ 5 వికెట్లకు 37 పరుగులే చేసింది.  ప్రస్తుతం జోస్‌ బట్లర్‌, రాహుల్‌ తెవాటియా  క్రీజులో ఉన్నారు.