గురువారం 09 జూలై 2020
Sports - Apr 26, 2020 , 15:27:35

పుజారకు బౌలింగ్ చేయడం చాలా కష్టం: కమిన్స్

పుజారకు బౌలింగ్ చేయడం చాలా కష్టం: కమిన్స్

సిడ్నీ: టెస్టుల్లో టీమ్​ఇండియా నయావాల్ చతేశ్వర్ పుజారకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని ఆస్ట్రేలియా పేసర్​, టెస్టు నంబర్​వన్ ర్యాంకు బౌలర్​ ప్యాట్ కమిన్స్ అన్నాడు. స్వదేశంలో జరిగిన 2018-19 టెస్టు సిరీస్​లో అతడిని ఔట్ చేసేందుకు చాలా కష్టపడ్డామని గుర్తు చేసుకున్నాడు. ఆ పర్యటనలో సత్తాచాటిన భారత్​… తొలిసారి ఆసీస్​ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. క్రికెట్ ఆస్ట్రేలియా తాజాగా నిర్వహించిన ఆన్​లైన్​ లైవ్ సెషన్​లో.. ఎవరికి బౌలింగ్​ చేసేందుకు ఎక్కువ కష్టపడ్డారనే ప్రశ్నకు కమిన్స్ సమాధానమిచ్చాడు. 'చాలా మంది ఉన్నారు. కానీ ఒకరు పేరు చెబుతాను. అతడే టీమ్​ఇండియా బ్యాట్స్​మన్​ చతేశ్వర్ పుజార. అతడు మమ్మల్నిఎంతో కష్టపెట్టాడు. ఆ సిరీస్​లో పుజార చాలా బాగా ఆడాడు. అతడిని ఔట్ చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రతిరోజు ఎంతో ఏకాగ్రతగా ఆడతాడు. నేను బౌలింగ్ చేసిన వాళ్లతో పుజారనే కఠినతమైన బ్యాట్స్​మన్​' అని కమిన్స్ సమాధానమిచ్చాడు. 2018-19 ఆసీస్ పర్యటనలో భాగంగా జరిగిన టెస్టు సిరీస్​లో పుజార 521పరుగులు చేసి టీమ్​ఇండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. 


logo