శుక్రవారం 22 జనవరి 2021
Sports - Jan 13, 2021 , 17:03:05

ప్చ్‌..కశ్యప్‌ తొలి రౌండ్‌లోనే..

ప్చ్‌..కశ్యప్‌ తొలి రౌండ్‌లోనే..

బ్యాంకాక్‌: పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీ బరిలో దిగిన భారత స్టార్‌ షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌కు నిరాశే ఎదురైంది.  కశ్యప్‌ గాయం కారణంగా థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌-1000 టోర్నీ తొలి రౌండ్‌ మధ్యలోనే వెనుదిరిగాడు. 

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భాగంగా బుధవారం కెనడాకు చెందిన జేసన్‌ ఆంథోనీ హో-షూతో   పోరులో కాలి పిక్క పట్టేయడంతో కశ్యప్‌ మ్యాచ్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకున్నాడు. ఓపెనింగ్‌ రౌండ్​లో కశ్యప్‌ 9-21, 21-13, 8-14తో  ఓడిపోయాడు. మూడో గేమ్‌లో కశ్యప్‌ 8-14తో వెనుకబడి ఉన్న సమయంలో కండరాలు పట్టేయడంతో పోటీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. తొలి గేమ్‌లో 9-21తో ఓడిన పారుపల్లి రెండో గేమ్‌లో 21-13తో నెగ్గాడు.  ఇప్పటికే పీవీ సింధు, సాయి ప్రణీత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించారు.  


logo