శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Mar 19, 2020 , 23:33:58

ఐవోసీ.. జోక్‌ చేస్తున్నావ్‌ కదూ..?

 ఐవోసీ.. జోక్‌ చేస్తున్నావ్‌ కదూ..?

న్యూఢిల్లీ: విశ్వక్రీడల కోసం అథ్లెట్లు ప్రాక్టీస్‌ కొనసాగించాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) సూచించడంపై భారత షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐవోసీ ప్రకటన అర్థరహితమని, ట్రైనింగ్‌ కేంద్రాలు కరోనా వైరస్‌ కారణంగా మూతబడితే.. ఎక్కడ శిక్షణ కొనసాగించాలని గురువారం ట్వీట్‌ చేశాడు. ‘శిక్షణ కొనసాగించాలని ఐవోసీ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నది.. ఎలా? ఎక్కడ? ఐవోసీ నువ్వు జోక్‌ చేస్తున్నావు కదూ. అసలు ఒలింపిక్స్‌ అర్హత పోటీలే పూర్తికాలేదు. అందరి సంక్షేమం కోసం స్వీయ నిర్భంధం  విధించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నందున.. ఇప్పటికే క్వాలిఫై అయిన వారు సన్నద్ధమయ్యేందుకు కూడా శిక్షణ కేంద్రాలు నడువడం లేదు. ఈ సమయంలో ట్రైనింగ్‌ కొనసాగించాలన్న ఐవోసీ ప్రకటన అర్థరహితం’ అని కశ్యప్‌ ట్వీట్‌లో పేర్కొన్నాడు.. 


logo