శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 12, 2020 , 19:09:40

ప్యారిస్‌ మారథాన్‌ రద్దు

ప్యారిస్‌ మారథాన్‌ రద్దు

ప్యారిస్‌ (ఫ్రాన్స్‌) : కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ప్యారిస్‌లో నిర్వహించాల్సిన మారథాన్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. మారథాన్‌ నిర్వహణకు పలుసార్లు నిర్వహించాలని కొత్త తేదీలు నిర్ణయించినా చివరకు రద్దు చేస్తున్నట్లు ది అసోసియేటెడ్‌ ప్రెస్‌ తెలిపింది. మారథాన్‌ వాస్తవానికి ఏప్రిల్‌లో నిర్వహించాల్సి ఉంది. కొవిడ్‌-19 వైరస్‌ కారణంగా అక్టోబర్‌కు వాయిదా వేశారు. మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో నవంబర్‌లో నిర్వహించేందుకు  రేసును రీ షెడ్యూల్ చేయడానికి నిర్వాహకులు ప్రయత్నించారని తెలిపింది. ఆంక్షల నేపథ్యంలో ప్రయాణం కొనసాగించడం సాధ్యం కాదని, చాలా మంది రన్నర్లు, ముఖ్యంగా విదేశాల నుంచి వస్తారని పేర్కొంది. 2021లో మారథాన్ ఏర్పాటు చేస్తే రన్నర్లకు మరింత మెరుగ్గా, సరళంగా ఉంటుందని నిర్ణయించారు’. అని వివరించింది. ఇకపై వచ్చే ఏడాది నిర్వహించే మారథాన్‌పై దృష్టి పెడుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది రేసులో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న రన్నర్లు వచ్చే ఏడాదికి ఆటోమెటిక్‌గా ఎంపికవుతారని చెప్పింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo