సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Jan 25, 2020 , 16:18:25

పాపం పంత్‌..

పాపం పంత్‌..

టీమిండియా యువ సంచలనం, వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మెన్‌ రిషభ్‌ పంత్‌ తన వరుస పరాభవాలతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తుది జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌: టీమిండియా యువ సంచలనం, వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మెన్‌ రిషభ్‌ పంత్‌ తన వరుస పరాభవాలతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తుది జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. పంత్‌ స్థానంలో బ్యాట్స్‌మెన్‌ లోకేష్‌ రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ చేస్తూ విజయవంతమయ్యాడు. ఈ మార్పుపై బీసీసీఐ అధ్యక్షడు సౌరవ్‌ గంగూలీ స్పందించారు. పంత్‌కు మంచి భవిష్యత్‌ ఉంది. అతడికి టీమ్‌ యాజమాన్యం చాలా అవకాశాలిచ్చింది. చాలా సార్లు విఫలమైనప్పటికీ.. భవిష్యత్‌ కోసం అతడికి అవకాశాలు ఇస్తూ వచ్చింది. కానీ, పంత్‌.. అడపాదడపా మ్యాచ్‌ల్లో రాణించడం తప్ప చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. పదే పదే అనవసర షాట్లు ఆడుతూ, వికెట్‌ సమర్పించుకుంటున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సైతం భాద్యతారాహిత్య షాట్లతో వికెట్‌ సమర్పించుకోవడం పరిపాటైంది. దీంతో, జట్టులో మార్పు అనివార్యమైందని గంగూలీ అన్నాడు. ఈ మార్పు జట్టు యాజమాన్యం, కెప్టెన్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రిలదేనని ఆయన తెలిపారు. 

కాగా, లోకేష్‌ రాహుల్‌.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో కర్ణాటక, ఐపీఎల్‌లో పంజాబ్‌ జట్లకు వికెట్‌ కీపర్‌గా విజయవంతంగా రాణించాడు. దీంతో, రాహుల్‌కు ఈ అవకాశం లభించింది. ఇదే విషయమై కెప్టెన్‌ కోహ్లి మాట్లాడుతూ.. రాహుల్‌ బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేయడం శుభపరిణామమన్నారు. దీంతో, మరో అదనపు బ్యాట్స్‌మెన్‌ను జట్టులోకి తీసుకోవడానికి అవకాశముంటుందని కోహ్లి అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు టెస్టుల్లో కూడా రాహుల్‌ బ్యాటింగ్‌లో విశేషంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. రాహుల్‌ సైతం తన ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నాడు. 


logo