మంగళవారం 02 మార్చి 2021
Sports - Feb 07, 2021 , 14:39:51

పుజారా, పంత్‌ అర్ధసెంచరీలు

పుజారా, పంత్‌ అర్ధసెంచరీలు

చెన్నై: ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్లు రిషబ్‌ పంత్(54)‌, చెతేశ్వర్‌ పుజారా(53) అర్ధశతకాలు సాధించారు. మూడో రోజు, ఆదివారం ఆటలో టీ విరామ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 4 వికెట్లకు 154 పరుగులు చేసింది. రెండో సెషన్‌లో ఇంగ్లాండ్‌ బౌలర్లు కీలక ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, రహానెలను ఔట్‌ చేసి పట్టుబిగించారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నాడు. పంత్‌, పుజారా ద్వయం ఐదో వికెట్‌కు 81 రన్స్‌  జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 578 పరుగులకు ఆలౌటైంది.   

VIDEOS

logo