గురువారం 09 జూలై 2020
Sports - Apr 15, 2020 , 18:21:43

`స్పీడ్‌బ్రేక‌ర్ల‌పై ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు తెలుస్తుంది`

`స్పీడ్‌బ్రేక‌ర్ల‌పై ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు తెలుస్తుంది`

త‌న ఎత్తుపై సెటైర్ వేసిన ఇషాంత్ శ‌ర్మ‌

న్యూఢిల్లీ:  అద‌న‌పు ఎత్తు కార‌ణంగా ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో.. అన్నే ఇబ్బందులు కూడా ఉన్నాయ‌ని టీమ్ఇండియా సీనియ‌ర్ పేస‌ర్ ఇషాంత్ శ‌ర్మ పేర్కొన్నాడు. పిచ్ నుంచి బౌన్స్ రాబ‌ట్టే విష‌యంలో ఎత్తు అనుకూలించినా.. వాహ‌నాల్లో ప్ర‌యాణిస్తున్న స‌మ‌య‌ల్లో త‌ల‌కు ఎన్నో సార్లు దెబ్బ‌లు త‌గిలాయ‌ని స‌ర‌దాగా పేర్కొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టు స‌భ్యుడు రిష‌బ్ పంత్‌పై ఈ లంబూ సెటైర్లు వేశాడు. `జ‌ట్టులో అంతా స‌వ్యంగానే ఉన్నారు. కానీ పంత్‌తోనే వ‌చ్చింది ఇబ్బంది. అత‌డు బంతిని ఎటువైపు బాదుతున్నాడో అత‌డికే తెలియ‌డం లేదు. నెట్స్‌లో బౌలింగ్ చేసేప్పుడు నేరుగా నా త‌ల‌నే ల‌క్ష్యంగా చేసుకొని షాట్లు ఆడుతున్నాడు` అని చెప్పాడు.. కొవిడ్‌-19 విజృంభిస్తున్న నేప‌థ్యంలో క్రీడాటోర్నీల‌న్నీ ర‌ద్దు కావ‌డంతో ఇండ్ల‌కే ప‌రిమిత‌మైన ఆట‌గాళ్లు.. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా అభిమానుల‌కు ట‌చ్‌లో ఉంటున్నారు. ఇందులో భాగంగా ఇషాంత్ శ‌ర్మ బుధ‌వారం ట్విట్ట‌ర్ లైవ్ నిర్వ‌హించాడు.

`పంత్ మిన‌హా మిగిలిన జ‌ట్టు స‌భ్యులంతా బాగానే ఉన్నారు. అత‌డే బంతిని ఏ దిశ‌లో కొడుతున్నాడో కూడా అర్థం కావ‌డం లేదు. భార‌త పేస‌ర్ల మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ వాతావ‌ర‌ణం ఉంది. అది జ‌ట్టుకు మంచి చేస్తున్న‌ది. టెస్టుల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌త్య‌ర్థిని రెండు సార్లు ఆలౌట్ చేయ‌క‌పోతే మ్యాచ్‌లు నెగ్గ‌లేం. మేమంతా క‌లిసి అదే చేస్తున్నాం. ఎత్తు విష‌యంలో ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో.. అంత‌కుమించి ఇబ్బందులు ఉన్నాయి. స్పీడ్ బ్రేక‌ర్‌లు ఉన్న రోడ్లో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు తెలుస్తుంది ఆ బాధేంటో.. టీమ్ఇండియా కెప్టెన్ చీకూ (కోహ్లీ)తో చిన్న‌ప్ప‌టి నుంచి మంచి అనుబంధం ఉంది. అండ‌ర్‌-17 స్థాయి నుంచి ఇద్ద‌రం క‌లిసి ఆడుతున్నాం` అని ఇషాంత్ చెప్పుకొచ్చాడు.


logo