శనివారం 04 జూలై 2020
Sports - Apr 16, 2020 , 10:44:47

పంత్ సూప‌ర్‌.. హార్దిక్ బెస్ట్ ఆల్‌రౌండ‌ర్‌: ష‌మీ

పంత్ సూప‌ర్‌.. హార్దిక్ బెస్ట్ ఆల్‌రౌండ‌ర్‌: ష‌మీ

కోల్‌క‌తా:  టీమ్ఇండియా యువ ఆట‌గాడు రిష‌బ్ పంత్‌లో అపార‌మైన ప్ర‌తిభ ఉంద‌ని పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ అన్నాడు. వ‌య‌సుకు మంచిన టాలెంట్ అత‌డి సొంత‌మ‌ని పేర్కొన్నాడు. భార‌త మాజీ ఆట‌గాడు ఇర్ఫాన్ ప‌ఠాన్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్న ష‌మీ.. త‌న అభిప్రాయాలు వ్య‌క్తం చేశాడు. లోకేశ్ రాహుల్ ప్ర‌స్తుతం అత్యుత్త‌మ ఫామ్‌లో ఉన్నాడ‌ని.. ఆల్‌రౌండ‌ర్ అంటే హార్దిక్ పాండ్యానే అని పేర్కొన్నాడు.

`యువ వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ పంత్‌లో చాలా టాలెంట్ ఉంది. అత‌డు నా స్నేహితుడ‌ని నేను ఈ మాట‌లు చెప్ప‌డం లేదు. పంత్ ఆత్మ‌విశ్వాసంతో బ‌రిలో దిగిన‌ప్పుడు అత‌డికి బౌలింగ్ చేయ‌డం చాలా క‌ష్టం. లోకేశ్ రాహుల్ కెరీర్ అత్యుత్త‌మ ఫామ్‌లో కొన‌సాగుతున్నాడు. అందుకే ఏ స్థానంలో అయినా దుమ్మురేప‌గ‌లుగుతున్నాడు. అత‌డెప్ప‌టికీ ఇలాగా ఆడాలని ఆశిస్తున్నా. ఆల్‌రౌండ‌ర్ అంటే నా దృష్టిలో హార్దిక్ పాండ్యానే` అని ష‌మీ చెప్పుకొచ్చాడు. 


logo