శనివారం 16 జనవరి 2021
Sports - Jan 11, 2021 , 08:25:16

పంత్‌ను వ‌రించిన అదృష్టం.. మూడు క్యాచ్‌లు మిస్‌

పంత్‌ను వ‌రించిన అదృష్టం..  మూడు క్యాచ్‌లు మిస్‌

భార‌త వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌కు ఈ మ్యాచ్‌లో అదృష్టం బాగానే క‌లిసొస్తుంది. మూడు ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద లియాన్ బౌలింగ్‌లో పంత్‌ ఇచ్చిన  క్యాచ్‌ను పైన్ వ‌దిలేశాడు.  అలానే 59 ప‌రుగుల వ‌ద్ద పంత్ క్యాచ్‌ను మ‌ళ్లీ వ‌దిలేశాడు పైన్. ఇక లియాన్ బౌలింగ్‌లో మ‌రోసారి పంత్ క్యాచ్ ఇవ్వ‌గా దానిని స్లిప్‌లో ఉన్న స్మిత్ అందుకోలేక‌పోయాడు. మొత్తానికి రెండో ఇన్నింగ్స్‌లో మూడు అద్భుత అవ‌కాశాలు రావ‌డంతో దానిని స‌ద్వినియోగం చేసుకుంటూ వ‌చ్చిన  రిష‌బ్ పంత్ 12 బౌండ‌రీలు, 3 సిక్స‌ర్ల‌తో 97ప‌రుగులు చేశాడు.  ఈ స‌మ‌యంలో లియాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి ఔట‌య్యాడు. దీంతో పుజారాతో నెల‌కొల్పిన 148 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి బ్రేక్ ప‌డింది.

ఇక స్టైలిష్  బ్యాట్స్ మెన్ పుజారా ఎప్ప‌టిలాగానే ఎంతో ఎకాగ్ర‌త‌తో ఆడుతూ కెరీర్‌లో మ‌రో అర్ధ సెంచ‌రీ న‌మోదు చేసుకున్నాడు. 172 బంతులు ఆడిన పుజారా 8 ఫోర్ల‌తో 58 ప‌రుగులు చేశాడు. అంతేకాక 6000 ప‌రుగుల‌ని పూర్తి చేసాడు.  ప్ర‌స్తుతానికి భార‌త్ స్కోరు మూడు వికెట్ల న‌ష్టానికి 250 ప‌రుగులు కాగా, ఈ మ్యాచ్ గెల‌వాలంటే మ‌రో 157 ప‌రుగులు చేయాల్సి ఉంది.