గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Sep 09, 2020 , 21:16:33

పంత్‌.. ధోని నీడ‌లో నుంచి బ‌య‌ట‌కు రా.. : ఎంఎస్‌కే ప్ర‌సాద్‌

పంత్‌.. ధోని నీడ‌లో నుంచి బ‌య‌ట‌కు రా.. : ఎంఎస్‌కే ప్ర‌సాద్‌

భార‌త్ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనితో పోలిక వ‌ల్లే పంత్‌పై ఒత్తిడి పెరిగి రాణించ‌లేక‌పోతున్నాడ‌ని బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్ట‌ర్ ఎంఎస్‌కే ప్ర‌సాద్ అన్నారు. త‌న‌కంటూ ప్ర‌త్యేక శైలిని అల‌వ‌ర్చుకోవాల‌ని, ఏ ఒక్క‌రినీ అనుక‌రించ‌వ‌ద్ద‌ని ప్ర‌సాద్ పంత్‌కు సూచించాడు. 

స్పోర్ట్‌కీడాతో చేసిన చాట్‌లో ప్ర‌సాద్ మాట్లాడుతూ ధోనితో పోలిక‌ల వ‌ల్ల పంత్ ముందుకు వెళ్ల‌లేక‌పోతున్నాడ‌న్నారు. "రిషబ్ గ్రౌండ్‌లో అడుగుపెట్టిన ప్ర‌తిసారి అభిమానులు అత‌డిని ధోనితో పోల్చేవారు. బహుశా పంత్‌కూడా ఆ ఆనందంలో చిక్కుకుని ఉండ‌వ‌చ్చు. అత‌డు ధోని నీడ నుంచి బ‌య‌ట‌కు రావాలి. ఈ విష‌యాన్ని మేము కూడా పంత్‌కు చాలాసార్లు చెప్పి చూశాం. నీలో ప్ర‌తిభ ఉంది. దాన్ని బ‌య‌ట‌కు తీ.. ఎవ‌రినీ అనుస‌రించ‌కు అని పంత్‌కు ప‌లుమార్లు చెప్పామ‌ని" ప్ర‌సాద్ అన్నారు. 

"మ‌హి పూర్తిగా భిన్నమైన వ్య‌క్తిత్వం క‌ల‌వాడు.. పంత్‌కు కూడా ప్ర‌త్యేక వ్య‌క్తిత్వం ఉంది. అత‌డికి ప్ర‌తిభ కూడా ఉంది. అందుకే మేము మ‌ద్ద‌తు ఇస్తున్నాం" అని ప్ర‌సాద్ అన్నారు. "పంత్ ఎల్లప్పుడూ ధోని నీడ‌లో ఉన్నాడు. తనను ధోనితో పోల్చుకోవ‌డం ప్రారంభించాడు. కాపీ చేయడం మొదలుపెట్టాడు. ప్రవర్తనలో, అన్నింటిలో.. దీని నుంచి బ‌య‌ట‌కు రావాలి"  అని ప్ర‌సాద్ అన్నారు. ఇప్పుడు ధోని అంత‌ర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు ప‌లికాడ‌ని, ఇప్ప‌టికైనా పంత్ అత‌డి నీడ‌లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి మెరుగ్గా రాణించాల‌ని ప్ర‌సాద్ సూచించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo