e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home స్పోర్ట్స్ రాహుల్‌ రఫ్ఫాట

రాహుల్‌ రఫ్ఫాట

రాహుల్‌ రఫ్ఫాట

బెంగళూరుపై పంజాబ్‌ జయభేరి.. రాణించిన గేల్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌

తాజా ఐపీఎల్‌ సీజన్‌లో పడుతూ లేస్తూ సాగుతున్న పంజాబ్‌ కింగ్స్‌.. పటిష్టమైన బెంగళూరును బెంబేలెత్తించింది. కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ మెరుపులు తోడవడంతో మొదట భారీ స్కోరు చేసిన పంజాబ్‌.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బెంగళూరు హిట్టర్లను కట్టిపడేసింది. కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌, డివిలియర్స్‌ను ఔట్‌ చేసిన హర్‌ప్రీత్‌ బ్రార్‌ పంజాబ్‌ కొత్త హీరోగా నిలిచాడు!

అహ్మదాబాద్‌: నిలకడలేమితో సతమతమవుతున్న పంజాబ్‌ కింగ్స్‌ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. బ్యాటింగ్‌లో లోకేశ్‌ రాహుల్‌ (57 బంతుల్లో 91 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ముందుండి నడిపించగా.. బౌలింగ్‌లో హర్‌ప్రీత్‌ బ్రార్‌ (3/19) దుమ్మురేపడంతో శుక్రవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 34 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. రాహుల్‌ యాంకర్‌ రోల్‌ పోషిస్తే.. క్రిస్‌ గేల్‌ (24 బంతుల్లో 46; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టాడు. బెంగళూరు బౌలర్లలో కైల్‌ జెమీసన్‌ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (35) టాప్‌ స్కోరర్‌. హర్‌ప్రీత్‌ బ్రార్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

రాహుల్‌ యాంకర్‌ రోల్‌..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ ఆరంభంలోనే వికెట్‌ కోల్పోయింది. మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (7) విఫలం కాగా.. క్రిస్‌ గేల్‌ ధాటిగా ఆడాడు. జెమీసన్‌ వేసిన ఐదో ఓవర్‌లో గేల్‌ 5 బౌండ్రీలు బాది స్కోరు బోర్డును ఉరకెలెత్తించాడు. చాహల్‌ వరుస ఓవర్లలో గేల్‌ రెండు సిక్సర్లు బాదితే.. రాహుల్‌ 4,6 అరుసుకోవడంతో 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ 90/1తో నిలిచింది. మరో భారీ షాట్‌కు యత్నించి గేల్‌ ఔట్‌ కాగా.. రాహుల్‌ 35 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పూరన్‌ (0), హుడా (5), షారుక్‌ ఖాన్‌ (0) పెవిలియన్‌కు క్యూ కట్టినా.. ఆఖర్లో హర్‌ప్రీత్‌ బ్రార్‌ (25 నాటౌట్‌; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు)తో కలిసి రాహుల్‌ వేగంగా ఆడటంతో పంజాబ్‌ మంచి స్కోరు చేయగలిగింది. చివరి మూడు ఓవర్లలో రాహుల్‌ సేన 47 పరుగులు రాబట్టడం విశేషం.

పోరాడకుండానే..

లక్ష్యఛేదనలో పడిక్కల్‌ (7) త్వరగానే ఔట్‌ కాగా.. కోహ్లీ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడటంతో.. 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 62/1తో నిలిచింది. ఆ మరుసటి ఓవర్‌లో హర్‌ప్రీత్‌ బ్రార్‌ వరుస బంతుల్లో కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌ (0)ను ఔట్‌ చేశాడు. డివిలియర్స్‌ (3)ను కూడా బ్రార్‌ బుట్టలో వేసుకోవడంతో.. బెంగళూరు పీకల్లోతు కష్టాల్లో పడింది. కాసేపు పోరాడిన రజత్‌ పాటిదార్‌(31).. జోర్డాన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ బాట పట్టగా.. షాబాజ్‌ అహ్మద్‌ (8), డానియల్‌ సామ్స్‌ (3)ను రవి బిష్ణోయ్‌ వరుస బంతుల్లో పెవిలియన్‌ పంపడంతో బెంగళూరు పరాజయం ఖాయమైంది.

  • అత్యధిక పరుగులు రాహుల్‌ 331
  • అత్యధిక వికెట్లు హర్షల్‌ పటేల్‌ 17

స్కోరు బోర్డు

పంజాబ్‌: రాహుల్‌ (నాటౌట్‌) 91, ప్రభ్‌సిమ్రన్‌ (సి) కోహ్లీ (బి) జెమీసన్‌ 7, గేల్‌ (సి) డివిలియర్స్‌ (బి) సామ్స్‌ 46, పూరన్‌ (సి) షాబాజ్‌ (బి) జెమీసన్‌ 0, హుడా (సి) పాటిదార్‌ (బి) షాబాజ్‌ 5, షారుక్‌ (బి) చాహల్‌ 0, బ్రార్‌ (నాటౌట్‌) 25, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 179/5. వికెట్ల పతనం: 1-9, 2-99, 3-107, 4-117, 5-118, బౌలింగ్‌: సామ్స్‌ 4-0-24-1, సిరాజ్‌ 3-0-24-0, జెమీసన్‌ 3-0-32-2, చాహల్‌ 4-0-34-1, హర్షల్‌ 4-0-53-0, షాబాజ్‌ 2-0-11-1.
బెంగళూరు: కోహ్లీ (బి) బ్రార్‌ 35, పడిక్కల్‌ (బి) మెరెడిత్‌ 7, పాటిదార్‌ (సి) పూరన్‌ (బి) జోర్డాన్‌ 31, మ్యాక్స్‌వెల్‌ (బి) బ్రార్‌ 0, డివిలియర్స్‌ (సి) రాహుల్‌ (బి) బ్రార్‌ 3, షాబాజ్‌ (సి) బ్రార్‌ (బి) రవి 8, సామ్స్‌ (బి) రవి 3, జెమీసన్‌ (నాటౌట్‌) 16, హర్షల్‌ (సి) రవి (బి) షమీ 31, సిరాజ్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 20 ఓవర్లలో 145/8. వికెట్ల పతనం: 1-19, 2-62, 3-62, 4-69, 5-91, 6-96, 7-96, 8-144, బౌలింగ్‌: మెరెడిత్‌ 3.2-0-29-1, షమీ 3.4-0-28-1, రవి 4-0-17-2, బ్రార్‌ 4-1-19-3, జోర్డాన్‌ 4-0-31-1, హుడా 1-0-13-0.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ నె,ర పా
చెన్నై 6 5 1 1.47 10
ఢిల్లీ 7 5 2 0.46 10
బెంగళూరు 7 5 2 -0.17 10
ముంబై 6 3 3 0.07 6
పంజాబ్‌ 7 3 4 -0.26 6
కోల్‌కతా 7 2 5 -0.49 4
రాజస్థాన్‌ 6 2 4 -0.69 4
హైదరాబాద్‌ 6 1 5 -0.26 2

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాహుల్‌ రఫ్ఫాట

ట్రెండింగ్‌

Advertisement