శుక్రవారం 03 జూలై 2020
Sports - Apr 11, 2020 , 16:49:37

జాన్‌రైట్ వ‌ల్ల మేము వెలుగులోకి వ‌చ్చాం: పాండ్యా బ్ర‌ద‌ర్స్‌

జాన్‌రైట్ వ‌ల్ల మేము వెలుగులోకి వ‌చ్చాం:  పాండ్యా బ్ర‌ద‌ర్స్‌

జాన్‌రైట్ వ‌ల్ల మేము వెలుగులోకి వ‌చ్చాం:  పాండ్యా బ్ర‌ద‌ర్స్‌

ముంబై: హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా..భార‌త క్రికెట్ జ‌ట్టులో కీల‌క ఆట‌గాళ్లు. ప‌దునైన పేస్‌కు తోడు మిడిలార్డ‌ర్‌లో డాషింగ్ బ్యాటింగ్ చేయ‌డంలో హార్దిక్ దిట్ట అయితే..ఉప‌యుక్త‌మైన స్పిన్‌తో ప్ర‌త్య‌ర్థి ప‌నిప‌ట్ట‌డంలో క్రునాల్ నేర్ప‌రి.  ఈ ఇద్ద‌రి అరంగేట్రం అంతా సులువుగా జ‌రుగలేదు. అన్న కంటే  ముందు హార్దిక్ జ‌ట్టులోకి రాగా, ఆల‌స్యంగా వ‌చ్చినా  అవ‌కాశాల‌ను క్రునాల్ చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకున్నాడు. అయితే తాము ఇలా వెలుగులోకి రావ‌డానికి కార‌ణం మాత్రం భార‌త మాజీ చీఫ్ కోచ్ జాన్ రైట్ అంటున్నాడు క్రునాల్. 

అస‌లు త‌మ క్రికెట్ నేప‌థ్యం ఎలా సాగిందో క్రునాల్ ఇలా చెప్పుకొచ్చాడు. ‘ప్ర‌భుత్వంలో ఒక స్పీడ్ పోస్ట్ జాబ్ కోసం నాకు ఓ ఉత్త‌రం వ‌చ్చింది. నాన్న కూడా చెప్పారు..ఇది మంచి అవ‌కాశం..నెల‌కు రూ.15-20 వేలు సంపాదించ‌వచ్చ‌న్నారు. కానీ అదే స‌మ‌యంలో స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీ కోసం ట్ర‌య‌ల్స్ న‌డుస్తున్నాయి. అప్పుడ‌నుకున్నాను..గ‌త కొన్నేండ్ల నుంచి చాలా క‌ష్డ‌ప‌డుతున్నాను. కొత్త ప్లేయ‌ర్‌గా నిరూంపిచుకునేందుకు మంచి అవ‌కాశం ల‌భిస్తుంద‌నుకున్నాను. ఆ ఉత్త‌రాన్ని చింపేసి బ‌రోడా త‌ర‌ఫున ట్ర‌య‌ల్స్ హాజ‌రై జ‌ట్టుకు ఎంపిక‌య్యాను, అప్ప‌టికే హార్దిక్‌ టీమ్‌లో ఉన్నాడు. ముంబైలో జ‌రిగిన టోర్నీలో మా ఆట‌తీరును..అప్ప‌టి ముంబై కోచ్ జాన్ రైట్ గ‌మ‌నించారు. మా ఇద్ద‌రిలోని ప్రతిభ‌ను గుర్తించి ముంబై ఇండియ‌న్స్ జట్టులో చోటు క‌ల్పించారు. అప్ప‌టి నుంచి మ‌ళ్లీ వెనుదిరిగి చూడ‌లేదు. ఒక వేళ నేను ట్ర‌య‌ల్స్‌కు హాజ‌రు కాకుండా  ఉద్యోగం వైపు వెళ్లేందుంటే..మా జీవితాలు ఇలా ఉండేవి కావు’ క్రునాల్ అన్నాడు. 


logo