చెలరేగిన పాండ్యా, జడేజా.. ఆస్ట్రేలియా టార్గెట్ 303

క్యాన్బెరా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో పర్వాలేదనిపించారు టీమిండియా బ్యాట్స్‌మెన్. టాప్, మిడిలార్డర్ ఫెయిలైనా.. చివర్లో ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా చెలరేగడంతో 50 ఓవర్లలో 5 వికెట్లకు 302 పరుగులు చేసింది టీమిండియా. అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న పాండ్యా.. ఈ మ్యాచ్‌లోనూ కేవలం 76 బంతుల్లో 92 పరుగులు చేయగా.. జడేజా 50 బంతుల్లో 66 పరుగులు చేయడం విశేషం. ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 150 పరుగులు జోడించారు. ఒక దశలో 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమ్‌ను ఈ ఇద్దరూ ఆదుకున్నారు. మెల్లగా మొదలుపెట్టి.. చివర్లో చెలరేగిపోయారు. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించారు. పాండ్యా 7 ఫోర్లు, 1 సిక్స్ బాదగా.. జడేజా 5 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టడం విశేషం. 108 బంతుల్లో 150 పరుగులు జోడించి ఇద్దరూ అజేయంగా నిలిచారు. అంతకుముందు ఓపెనర్లు ధావన్ (16), శుభ్‌మన్ గిల్ (33) విఫలమైనా.. కెప్టెన్ కోహ్లి (63) హాఫ్ సెంచరీ చేశాడు. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ (19), రాహుల్ (5) కూడా నిరాశపరిచారు. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
- ఇంటర్ విద్యార్థిని అదృశ్యం..
- గణతంత్ర దినోత్సవ అతిథులకు అభినందనలు : మంత్రి
- క్రికెట్ ఆడిన సీపీ సజ్జనార్
- విజయ్ దేవరకొండ లైగర్ షూట్ షురూ ..వీడియో
- 'గాలి సంపత్` విడుదల తేదీ ఖరారు
- రేగు పండు.. ఖనిజాలు మెండు..!
- దీదీపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడిన ఆటో.. ఇద్దరు దుర్మరణం
- కరెంట్ షాక్‌తో రైతు మృతి
- గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న నటుడు నవీన్ చంద్ర