బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 31, 2020 , 22:07:59

మనీశ్‌ పాండే ఔట్‌

మనీశ్‌ పాండే ఔట్‌

షార్జా : రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్దేశించిన 121 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(8) ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మనీశ్‌ పాండే(26) బౌలర్లపై ఎదురుదాడికి  దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా కూడా వేగంగా బ్యాటింగ్‌ చేయడంతో పవర్‌ప్లే ఆఖరికి హైదరాబాద్‌ 58/1తో నిలిచింది. 

చాహల్‌ వేసిన తర్వాతి ఓవర్లో మనీశ్‌ పాండే అనవసర షాట్‌కు ప్రయత్నించి క్యాచ్‌ ఔటయ్యాడు.  సాధించాల్సిన రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో సన్‌రైజర్స్‌ స్వేచ్ఛగా ఆడుతోంది.  8 ఓవర్లకు  హైదరాబాద్‌ 2 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. సాహా(25), కేన్‌ విలియమ్సన్‌(1) క్రీజులో ఉన్నారు.