శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 14, 2020 , 16:13:39

స్టన్నింగ్ క్యాచ్‌ చూశారా? వీడియో వైరల్‌

 స్టన్నింగ్ క్యాచ్‌ చూశారా? వీడియో వైరల్‌

ఇస్లామాబాద్:  పాకిస్థాన్‌ దేశవాళీ టోర్నీ నేషనల్‌ టీ20 కప్‌లో ఆ దేశ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ కళ్లుచెదిరే క్యాచ్‌ అందుకున్నాడు.  మంగళవారం సింధ్‌తో జరిగిన మ్యాచ్‌లో  ఖైబర్‌ ఫక్తున్‌క్వా  జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న  28ఏండ్ల రిజ్వాన్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు.  సింధ్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో ఈ అద్భుత విన్యాసం చోటుచేసుకుంది.  సింధ్‌ విజయానికి చివరి 12 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉంది. 

ఈ సమయంలో  బ్యాట్స్‌మన్‌ అన్వర్‌ అలీ భారీ షాట్‌కు ప్రయత్నించగా బంతిని సరిగా కనెక్ట్‌ చేయలేకపోవడంతో  నాన్‌స్ట్రైకింగ్‌కు దగ్గర్లోనే గాల్లో లేచింది.  వాస్తవానికి బౌలర్‌ బంతి అందుకునేందుకు అవకాశం ఉన్నా అతడు క్యాచ్‌ కోసం  ప్రయత్నించలేదు.  ఎక్స్‌ట్రా కవర్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రిజ్వాన్‌ వేగంగా  పరుగెత్తుకుంటూ వచ్చి  గాల్లో డైవ్‌ చేసి ఆ బంతిని అందుకున్నాడు.  టోర్నమెంట్‌లోనే ఇది అత్యుత్తమ క్యాచ్‌ అని పాక్‌ క్రికెట్‌ బోర్డుతో పాటు ఆదేశ మాజీలు ప్రశంసలు  కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.