శుక్రవారం 15 జనవరి 2021
Sports - Dec 23, 2020 , 00:34:13

పాకిస్థాన్‌కు ఓదార్పు విజయం

పాకిస్థాన్‌కు ఓదార్పు విజయం

నేపియర్‌ (న్యూజిలాండ్‌): వరుస పరాజయాలతో ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన పాకిస్థాన్‌ జట్టు.. మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా 1-2తో సిరీస్‌ను ముగించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు చేసింది. కాన్‌వే (63) టాప్‌ స్కోరర్‌. పాక్‌ బౌలర్లలో ఫహీమ్‌ అష్రఫ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో కొత్త టెస్టు కెప్టెన్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ (59 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో పాక్‌ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసి నెగ్గింది.