గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 17, 2020 , 13:18:13

ఇండియాకు షాక్‌.. క‌బ‌డ్డీ వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన పాకిస్థాన్‌

ఇండియాకు షాక్‌.. క‌బ‌డ్డీ వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన పాకిస్థాన్‌

హైద‌రాబాద్‌:  అన‌ధికార క‌బ‌డ్డీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను పాకిస్థాన్ కైవ‌సం చేసుకున్నది.  లాహోర్‌లోని పంజాబ్ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో.. భార‌త్‌పై 43-41 స్కోర్ తేడాతో పాక్ నెగ్గింది.  హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో.. ఫ‌స్ట్ హాఫ్‌లో ఇండియా డామినేట్ చేసింది. కానీ సెకండ్ హాఫ్‌లో పాక్ త‌న జోరును ప్ర‌ద‌ర్శించి.. క‌బ‌డ్డీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను తొలిసారి త‌న ఖాతాలో వేసుకున్న‌ది.  రెండు సెష‌న్స్‌లోనూ రెండు దేశాల మ‌ధ్య మ్యాచ్ నువ్వానేనా అన్న‌ట్టుగా సాగింది. పాక్ ఆట‌గాళ్లు బిన్‌యామీన్‌, ఇర్ఫాన్ మానా, షఫిక్ చిస్తీలు త‌మ జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు.  క‌బ‌డ్డీ వ‌ర‌ల్డ్‌క‌ప్ తొలిసారి పాకిస్థాన్‌లో జ‌రిగింది.  గ‌తంలో ఆరుసార్లు ఈ టోర్న‌మెంట్‌ను ఇండియాలోనే నిర్వ‌హించారు.  8 రోజుల పాటు సాగిన టోర్నీలో.. లాహోర్‌, ఫైస‌లాబాద్‌, క‌ర్తార్‌పూర్‌, నాన్‌క‌న్ సాహిబ్ న‌గ‌రాల్లో మ్యాచ్‌లను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌లో ఇండియాతో పాటు ఇరాన్, కెన‌డా, ఆస్ట్రేలియా, అమెరికా, సియ‌రాలియోన్‌, కెన్యా కూడా పాల్గొన్నాయి.  టైటిల్ గెలిచిన పాక్‌కు ఆ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్ కంగ్రాట్స్ చెప్పారు.  

అన‌ధికార బృందం..


వాస్త‌వానికి పాక్‌కు వెళ్లింది అస‌లైన ఇండియా టీమ్ కాదు.  పాకిస్థాన్ వెళ్లేందుకు టీమిండియా క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ల‌కు ఎవ్వ‌రికీ అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని ఇటీవ‌ల క్రీడ‌ల మంత్రి కిర‌ణ్ రిజ్జు తెలిపారు. కానీ ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త ప్లేయ‌ర్లు ఇండియా పేరుతో జెర్సీలు వేసుకోలేదు. టోర్నీ ఆరంభానికి ముందే కొంద‌రు ప్లేయ‌ర్లు, కోచ్‌లు పాక్‌కు వెళ్లారు. వాళ్లంతా వాఘా బోర్డ‌ర్ మీదుగా పాక్‌కు చేరుకున్నారు. అమెచ్యూర్ క‌బ‌డ్డీ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా మాత్రం ఓ క్లారిటీ ఇచ్చింది. తామెవ్వ‌రికీ అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని ఏకేఎఫ్ఐ చెప్పింది. భార‌త ఒలింపిక్ సంఘం కూడా ఆ టోర్నీని కొట్టిపారేసింది.  ప్ర‌పంచ క‌బడ్డీ స‌మాఖ్య కూడా ఆ టోర్నీకి అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేసింది. టోర్నీ గెలిచిన పాక్ ప్లేయ‌ర్ల‌కు ప‌ది ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీ ఇచ్చారు. ర‌న్న‌ర‌ప్‌కు ఏడున్న‌ర ల‌క్ష‌లు ఇచ్చారు. వాస్త‌వానికి 2008 ముంబై దాడుల త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య ఎటువంటి ద్వైపాక్షిక క్రీడా సిరీస్‌లు లేవు. 


logo
>>>>>>