సోమవారం 08 మార్చి 2021
Sports - Feb 12, 2021 , 01:43:24

పాక్‌ బోణీ

పాక్‌ బోణీ

లాహోర్‌: టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికాపై పూర్తి ఆధిపత్యం కనబర్చి సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన పాకిస్థాన్‌ టీ20ల్లోనూ బోణీ కొట్టింది. గురువారం ఇక్కడ జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్‌ 3 పరుగుల తేడాతో నెగ్గింది. రిజ్వాన్‌ (64 బంతు ల్లో 104 నాటౌట్‌; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో మొదట బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. రిజ్వాన్‌ ఒంటరి పోరాటం చేయగా.. అతడికి రెండో ఎండ్‌ నుంచి సహకారం లభించలేదు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ హెండ్రిక్స్‌ (54), మలాన్‌ (44) పోరాడినా ఫలితం లేకపోయింది. 


VIDEOS

logo