సోమవారం 18 జనవరి 2021
Sports - Dec 01, 2020 , 16:31:32

మరో ముగ్గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌

మరో ముగ్గురు  క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌ పర్యటనకు వచ్చిన పాకిస్థాన్‌ జట్టులో కరోనా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.  తాజాగా మరో ముగ్గురు ఆటగాళ్లకు కొవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ కావడంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 10కి చేరింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆటగాళ్లు  బస చేస్తున్న హోటల్‌ వదిలి ప్రాక్టీస్‌ చేయడానికి వెళ్లకుండా కివీస్‌ బోర్డు  ఆంక్షలు విధించింది.  

పాక్‌ ఆటగాళ్లు బయో సెక్యూర్‌ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని ఇప్పటికే క్రికెట్‌ న్యూజిలాండ్‌ ఆరోపిస్తోంది. బాబర్‌ అజామ్‌ సారథ్యంలో 53 మంది సభ్యుల పాకిస్థాన్‌ జట్టు గత మంగళవారం న్యూజిలాండ్‌ చేరుకున్న విషయం తెలిసిందే.  కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు.  డిసెంబరు 18 నుంచి ఈడెన్‌ పార్క్‌ వేదికగా  టీ20 మ్యాచ్‌తో సిరీస్‌ ఆరంభంకానుంది.