బుధవారం 08 జూలై 2020
Sports - Jun 29, 2020 , 16:05:25

ఇంగ్లం‌డ్‌ చేరిన పాకిస్థాన్‌ జట్టు

ఇంగ్లం‌డ్‌ చేరిన పాకిస్థాన్‌ జట్టు

కరాచీ : ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు, టీ20 సిరీస్‌ ఆడేందుకు పాకిస్థాన్‌ జట్టు ఇంగ్లండ్‌ చేరుకుంది. ఈ సందర్భంగా ‘ఇంగ్లండ్‌ వంటి పటిష్ట జట్టుతో ఆడటం గొప్పగా ఉంటుంది. ఎప్పటిలాగే అభిమానుల ఆశీస్సులు మావెంటే ఉంటాయని నమ్ముతున్నా’ అంటూ బాబర్‌ విమానంలో తన సహచరులతో దిగిన ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశాడు. అయితే ఇంగ్లండ్‌ చేరుకున్న పాక్‌ టీం సభ్యులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోటల్‌లో 14రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ క్వారంటైన్‌ సమయం ముగిసిన తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌గా నిర్ధారణ అయితే ప్రాక్టీస్‌ను ప్రారంభిచంనున్నారు. 

పాకిస్థాన్‌ 29 మందితో కూడిన జట్టును ఇంగ్లండ్‌కు పంపాలనుకుంది. కానీ అందులో 10 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మరో మారు వారికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించిన తర్వాత నెగిటివ్‌ వస్తే ఈ 10 మంది కూడా ఇంగ్లండ్‌ వెళ్లి తమ జట్టులో చేరవచ్చని ఈసీబీ తెలిపింది. 


logo