పాకిస్థాన్‌దే పైచేయి దక్షిణాఫ్రికా

- తొలి ఇన్నింగ్స్ 106/4
రావల్పిండి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య పాకిస్థాన్ పైచేయి సాధించింది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 106/4తో నిలిచింది. కెప్టెన్ డికాక్ (24), బవూమా (15), క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ రెండు వికెట్లు పడగొట్టాడు. చేతిలో ఆరు వికెట్లు ఉన్న దక్షిణాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ స్కోరుకు 166 పరుగుల దూరంలో ఉంది. ఎల్గర్ (15), డసెన్ (0), మార్క్మ్ (32), డుప్లెసిస్ (17) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 145/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్థాన్ చివరకు 272 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (77), ఫవద్ ఆలమ్ (45) ఎక్కువసేపు నిలువలేకపోగా.. ఫహీమ్ అష్రఫ్ (78 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టుకు గౌరవప్రద స్కోరు అందించాడు. సఫారీ బౌలర్లలో నోర్జేకు 5 వికెట్లు దక్కాయి.