మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 14, 2020 , 01:53:38

పాకిస్థాన్‌ 126/5

 పాకిస్థాన్‌ 126/5

 సౌతాంప్టన్‌: ఇంగ్లండ్‌తో సిరీస్‌లో నిలువాలంటే తప్పక సత్తాచాటాల్సిన రెండో టెస్టును పాకిస్థాన్‌ తడబాటుతో ఆరంభించింది. గురువారం ఇక్కడ ప్రారంభమైన రెండు టెస్టులో తొలి టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌.. ఇంగ్లండ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ దాడిని సమర్థంగా ఎదుర్కొలేకపోయింది. వర్షం కారణంగా తొలి రోజు 45.4 ఓవర్ల ఆటే జరుగగా 126 పరుగులు చేసిన పాకిస్థాన్‌ ఐదు వికెట్లు కోల్పోయింది. పాక్‌ బ్యాట్స్‌మెన్‌లో అబిద్‌ అలీ(60) ఒక్కడే రాణించాడు. ప్రస్తుతం క్రీజు లో బాబర్‌ ఆజం(25), మహమ్మద్‌ రిజ్వాన్‌ (4) ఉన్నారు. తొలి మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయిన ఇంగ్లండ్‌ సీనియర్‌ పేసర్‌ అండర్సన్‌(2/35) ఫామ్‌లోకి వచ్చాడు. పాక్‌ ఓపెనర్‌ షాన్‌ మసూద్‌(1)ను మూడో ఓవర్లోనే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత పాక్‌  కెప్టెన్‌  అజర్‌  అలీ(20),  షఫీక్‌ (5), ఫవద్‌ ఆలమ్‌ (0) నిరాశపరిచారు. కాసేపు ధాటిగా ఆడిన అబిద్‌  అలీని ఇంగ్లండ్‌  పేసర్‌ కరన్‌  ఔట్‌  చేశాడు.    


logo