e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన పాకిస్థాన్ కెప్టెన్‌

విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన పాకిస్థాన్ కెప్టెన్‌

విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన పాకిస్థాన్ కెప్టెన్‌

సెంచూరియ‌న్‌: పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. వ‌న్డేల్లో అత‌ను 13వ సెంచ‌రీ న‌మోదు చేశాడు. నిన్న‌ సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డేలో అత‌ను 103 ర‌న్స్ చేశాడు. అయితే కేవ‌లం 76వ ఇన్నింగ్స్‌లోనే బాబ‌ర్ ఆజ‌మ్ ఆ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. అత్యంత వేగంగా వ‌న్డేల్లో 13 సెంచ‌రీలు చేసిన ప్లేయ‌ర్ల‌లో హ‌సీమ్ ఆమ్లా, విరాట్ కోహ్లీ ఉన్నారు. సౌతాఫ్రికా క్రికెట‌ర్ ఆమ్లా 83 ఇన్నింగ్స్‌లో 13 సెంచ‌రీల మైలురాయిని అందుకున్నాడు. భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీకి వ‌న్డేల్లో 13 సెంచ‌రీలు చేసేందుకు 86 ఇన్నింగ్స్‌లు ప‌ట్టింది. నిజానికి గ‌డిచిన రెండేళ్ల నుంచి కోహ్లీ వ‌న్డేల్లో సెంచ‌రీ చేయ‌లేదు. అయినా ప్ర‌స్తుతం వ‌న్డేల్లో కోహ్లీనే బ్యాటింగ్‌లో డామినేట్ చేస్తున్నాడు. 857 పాయింట్ల‌తో విరాట్ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్నాడు. పాక్ కెప్టెన్ బాబ‌ర్ 837 పాయింట్ల‌తో రెండ‌వ స్థానంలో ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన పాకిస్థాన్ కెప్టెన్‌

ట్రెండింగ్‌

Advertisement