సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Aug 08, 2020 , 16:21:48

రెండో ఇన్నింగ్స్​లో పాక్ ఢమాల్​.. ఇంగ్లండ్ లక్ష్యం 277

రెండో ఇన్నింగ్స్​లో పాక్ ఢమాల్​.. ఇంగ్లండ్ లక్ష్యం 277

మాంచెస్టర్​: ఇంగ్లండ్​తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో పాకిస్థాన్ 169 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్​లో  326 పరుగులతో రాణించిన పాక్ రెండో ఇన్నింగ్స్​లో స్వల్ప స్కోరుకే పరిమితమవడంతో గెలుపుపై ఇంగ్లండ్​కు ఆశలు చిగురించాయి. మ్యాచ్ నాలుగో రోజైన శనివారం 137 పరుగులకు 8 వికెట్ల ఓవర్​నైట్​ స్కోరుతో బరిలోకి దిగిన పాక్​ 169 పరుగులకు ఆలౌటైంది. ఎనిమిదో స్థానంలో వచ్చిన పాక్ ఆటగాడు యాసిర్​ షా(33) టాప్ స్కోరర్​గా నిలువగా మిగిలిన వారు ఎవరూ 30పరుగుల మార్క్​ను కూడా దాటలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్​ మూడు, క్రిస్ వోక్స్, బెన్​ స్టోక్స్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. డోమ్ బెస్​, జొఫ్రా ఆర్చర్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా తొలి ఇన్నింగ్స్​లో  ఇంగ్లండ్​ 219 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. విజయం కోసం ఆతిథ్య ఇంగ్లండ్​  రెండో ఇన్నింగ్స్​లో 277 పరుగులు చేయాల్సి ఉంది. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో ఇంగ్లండ్ వేదికగా బయో సెక్యూర్ వాతావరణంలో ఈ మూడు టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. 


logo