మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 10, 2020 , 02:31:01

నసీమ్‌ షా రికార్డు హ్యాట్రిక్‌

నసీమ్‌ షా రికార్డు హ్యాట్రిక్‌

రావల్పిండి: టెస్టు క్రికెట్‌లో అతి పిన్న వయసులో హ్యాట్రిక్‌ సాధించిన బౌలర్‌గా పాకిస్థాన్‌ పేసర్‌ నసీమ్‌ షా (16 ఏండ్ల 359 రోజులు) రికార్డుల్లోకెక్కాడు. నసీమ్‌ (4/26)తో పాటు యాసిర్‌ షా (2/33) కూడా విజృంభించడంతో ఆదివారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 126/6తో నిలిచింది. చేతిలో 4 వికెట్లు ఉన్న బంగ్లా ఇన్నింగ్స్‌ పరాజయం తప్పించుకోవాలంటే ఇంకా 86 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం కెప్టెన్‌ మోమినుల్‌ మక్‌ (37), లిటన్‌ దాస్‌ (0) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 342/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాక్‌ 445 పరుగులకు ఆలౌటైంది. బాబర్‌ ఆజమ్‌ (143) క్రితం రోజు స్కోరు వద్దే వెనుదిరగ్గా.. హరీస్‌ సోహైల్‌ (75) రాణించాడు. బంగ్లా బౌలర్లలో అబు జయేద్‌, రూబెల్‌ హుసేన్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.logo
>>>>>>