బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 07, 2020 , 17:22:26

బెన్‌స్టోక్స్‌ డకౌట్‌..కష్టాల్లో ఇంగ్లాండ్‌

బెన్‌స్టోక్స్‌ డకౌట్‌..కష్టాల్లో ఇంగ్లాండ్‌

మాంచెస్టర్‌: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో పాకిస్థాన్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. పాక్‌  సంచలన బౌలింగ్‌తో  మ్యాచ్‌పై పట్టుబిగించింది. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి ఇంగ్లాండ్‌ 47.2 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది.  స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌  డకౌట్‌ అయ్యాడు.  మహ్మద్‌ అబ్బాస్‌ బౌలింగ్‌లో  వికెట్ల ముందు దొరికిపోయాడు.  మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఓలీ పోప్‌(62) మాత్రమే అర్ధశతకంతో ఆదుకున్నాడు.

పాక్‌ పేసర్ల ధాటికి తడబడ్డ ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో  179 పరుగులు వెనుకబడి ఉన్నది.  టాప్‌ ఆర్డర్‌ ఘోరంగా విఫలమవడంతో ఇంగ్లీష్‌ జట్టుపై ఒత్తిడి పెరిగింది.  జోస్‌ బట్లర్‌(29), క్రిస్‌ వోక్స్‌(13) క్రీజులో ఉన్నారు.  అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 326 పరుగులు చేసింది. logo