గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Jul 30, 2020 , 16:08:15

5సార్లు పాజిటివ్‌..ఎట్టకేలకు హారీస్‌కు‌ కరోనా నెగెటివ్‌

5సార్లు పాజిటివ్‌..ఎట్టకేలకు  హారీస్‌కు‌ కరోనా నెగెటివ్‌

ఇస్లామాబాద్‌:  కరోనా వైరస్‌తో నెలరోజులుగా పడుతున్న ఇబ్బందుల నుంచి  పాకిస్థాన్‌ పేసర్‌ హారిస్‌ రౌఫ్‌కు   ఎట్టకేలకు  ఊరట లభించింది.  తాజాగా అతడికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ ఫలితం వచ్చింది. దీంతో స్పీడ్‌స్టర్‌   ఇంగ్లాండ్‌ వెళ్లేందుకు లైన్‌క్లియర్‌ అయింది. ఇప్పటికే పాక్‌ జట్టు మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ టూర్‌ కోసం పాక్‌ 29 మంది ఆటగాళ్లతో బృందాన్ని ఎంపిక చేసింది. ఐతే హారిస్‌కు ఐదుసార్లు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అతడు ఆదేశానికి వెళ్లలేకపోయాడు. 

ఇప్పటికే హరీస్‌కు ఒకసారి కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ  కోవిడ్‌-19 నిబంధనల ప్రకారం వరుసగా రెండుసార్లు నెగెటివ్‌ వస్తేనే రౌఫ్‌ పూర్తిగా కోలుకున్నట్లు లెక్క.  అప్పుడు మాత్రమే అతడు ఇంగ్లాండ్‌లోని జట్టుతో కలిసే అవకాశం   ఉంటుంది. 26ఏండ్ల హారీస్‌కు కోవిడ్‌-19 లక్షణాలు లేకపోవడం గమనార్హం. 


logo