శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 05, 2020 , 15:30:39

ENGvPAK: పాకిస్థాన్‌ ఫస్ట్‌ బ్యాటింగ్‌

ENGvPAK: పాకిస్థాన్‌ ఫస్ట్‌ బ్యాటింగ్‌

మాంచెస్టర్‌:  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ మధ్య పోరు ఆరంభమైంది. మూడు టెస్టుల సిరీస్‌లో బుధవారం తొలి టెస్టులో టాస్‌ గెలిచిన పాక్‌ కెప్టెన్‌ అజహర్‌ అలీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.  తొలి టెస్టులో పాక్‌ ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగుతున్నది.

 పాక్‌ నుంచి ఆతిథ్య జట్టుకు  గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.  మరోవైపు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న  ఇంగ్లీష్‌ జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో  అదరగొట్టాలని ఉవ్విళ్లూరుతున్నది. బయో సెక్యూర్‌ వాతావరణంలో మ్యాచ్‌ జరుగుతున్నది. పాక్‌ చివరిసారిగా 1996లో  ఇంగ్లాండ్‌లో  టెస్టు సిరీస్‌ నెగ్గింది.


logo