సోమవారం 25 జనవరి 2021
Sports - Dec 20, 2020 , 12:18:07

ఇండియా 36 ఆలౌట్‌.. పండ‌గ చేసుకుంటున్న పాకిస్థాన్‌

ఇండియా 36 ఆలౌట్‌.. పండ‌గ చేసుకుంటున్న పాకిస్థాన్‌

ఇస్లామాబాద్‌: ఇండియ‌న్ క్రికెట్ చ‌రిత్ర‌లోనే చీక‌టి రోజుగా మిగిలిపోయింది డిసెంబ‌ర్ 19, 2020. ఆస్ట్రేలియ‌తో జ‌రిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కేవ‌లం 36 ప‌రుగుల‌కే చాప చుట్టేసి దారుణ ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకున్న కోహ్లి సేన‌.. కోట్లాది మంది అభిమానుల గుండెలు బ‌ద్ధ‌ల‌య్యేలా చేసింది. రెండు రోజుల పాటు మ్యాచ్‌పై ప‌ట్టు బిగించి.. కేవ‌లం రెండే రెండు గంట‌ల్లో చేతులెత్తేసిన తీరును ఫ్యాన్స్ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ ఘోర అవ‌మానాన్ని త‌ట్టుకోలేక‌.. కోహ్లి సేన‌ను ట్విట‌ర్‌లో ఆడుకుంటున్నారు ఇండియ‌న్ ఫ్యాన్స్‌. మ‌ర‌చిపోవాల్సిన ఓటీపీ 49204084041 అంటూ ఏకంగా టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒక్క ముక్క‌లో టీమ్ ప‌రువు తీశాడు. అదే స‌మ‌యంలో అటు పాకిస్థాన్ అభిమానులైతే పండ‌గ చేసుకుంటున్నారు. ట్విట‌ర్‌లో ఇండియ‌న్ టీమ్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. భార‌త‌ టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో అతి త‌క్కువ స్కోరుకు కోహ్లి సేన చాప చుట్టేయ‌గానే.. పాకిస్థాన్ ట్విట‌ర్‌లో 36ఆలౌట్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. థ్యాంక్యూ 2020 అని ఒక‌రు.. మా బౌల‌ర్ సెంచ‌రీ చేసి గ్రౌండ్‌లో టీమిండియా 36కే ఆలౌటైంద‌ని మ‌రొక‌రు.. ఈ దెబ్బ‌తో చెత్త రికార్డు పాకిస్థాన్ పేరు మీది నుంచి ఇండియాకు మారింద‌ని ఇంకొక‌రు.. కోహ్లి సేన‌ను ఆడుకుంటున్నారు. 


logo