మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 13, 2020 , 22:39:44

పాక్ జ‌ట్టుకు పెద్ద‌గా అవ‌గాహ‌న లేదు

పాక్ జ‌ట్టుకు పెద్ద‌గా అవ‌గాహ‌న లేదు


బాలౌట్‌పై ఇర్ఫాన్ ప‌ఠాన్ వ్యాఖ్య‌

న్యూఢిల్లీ: 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యంలో పాకిస్థాన్ జ‌ట్టుకు బాలౌట్ నిబంధ‌న‌పై స‌రైన అవ‌గాహ‌న లేద‌ని భార‌త మాజీ ఆల్‌రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ పేర్కొన్నాడు. పొట్టి ఫార్మాట్‌లో జ‌రిగిన తొలి ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌హేంద్ర‌సింగ్ ధోనీ నాయ‌క‌త్వంలోని టీమ్ఇండియా విజేతగా నిలిచిన విష‌యం తెలిసిందే. ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రిగిన ఈ మెగాటోర్నీలో భార‌త జ‌ట్టు ఒక‌టికి రెండుసార్లు పాకిస్థాన్‌ను చిత్తు చేసి విశ్వ‌విజేత‌గా నిలిచింది. 

లీగ్ ద‌శ‌లో దాయాదుల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ టై కావ‌డంతో ఫ‌లితం తేల్చేందుకు బాలౌట్ ప‌ద్ధ‌తిని వినియోగించారు. అయితే ఈ అంశంపై అప్ప‌టి పాక్ జ‌ట్టుకు పెద్ద‌గా ప‌ట్టులేద‌ని ఇర్ఫాన్ అన్నాడు. గురువారం ప‌ఠాన్ ఓ టీవీ షోలో మాట్లాడుతూ.. `ఈ అంశాన్ని అప్ప‌టి పాకిస్థాన్ కెప్టెనే ఒక సంద‌ర్భంలో మీడియాతో చెప్పాడు. అప్ప‌టికి మాకు బాలౌట్‌పై పెద్ద‌గా అవ‌గాహ‌న‌లేద‌ని. ఇక బాలౌట్‌కు వ‌చ్చేస‌రికి పూర్తి ర‌న‌ప్‌తో బౌలింగ్ చేయాలా, లేక స‌గం ర‌న‌ప్‌తో బంతి విస‌రాలా అనే అంశంలో వాళ్ల‌కు స్ప‌ష్ట‌త లేదు. అదే మా జ‌ట్టు విష‌యానికివ‌స్తే.. మేము ముందుగానే దానికి సిద్ధ‌మై ఉన్నాం`అని అన్నాడు. 

ఈ అంశంపై అప్ప‌టి జ‌ట్టు స‌భ్యుడు రాబిన్ ఊత‌ప్ప మాట్లాడుతూ.. `మేము ప్రాక్టీస్ చేసిన ప్ర‌తీసారి వెంక‌టేశ్ ప్ర‌సాద్ మాతో బాలౌట్ చేయించేవాడు. ఫుట్‌బాల్ ఆడాక ఇది త‌ప్ప‌నిస‌రి. సెహ్వాగ్‌, నేను, రోహిత్ శ‌ర్మ ఎప్పుడూ వికెట్ మిస్ చేసేవాళ్లం కాదు. అదే బాలౌట్‌లోనూ చేసి చూపెట్టాం. కెప్టెన్‌గా ధోనీకి అదే తొలి టోర్నీ అయినా అత‌డు ధైర్యంగా నిర్ణ‌యాలు తీసుకున్నాడు. స్వ‌త‌హ‌గా బౌల‌ర్‌ను కాన‌ప్ప‌టికీ నాపై ఉన్న న‌మ్మ‌కంతో అత‌డి ఈ అవ‌కాశాన్ని నాకిచ్చాడు. నేను క‌చ్చితంగా వికెట్ల‌ను గిరాటేస్తాన‌ని ధోనీకి చెప్పా అత‌డు స‌రే వెళ్లు అన్నాడు అంతే. అంత‌కుముందు మ్యాచ్‌ను ప‌రిశీలిస్తే మేము ఓడిపోయే స్థితిలోనే ఉన్నాం. శ్రీ‌శాంత్ చ‌క్క‌టి బౌలింగ్ కార‌ణంగా మ్యాచ్ టై అయింది` అని వివ‌రించాడు.logo