మంగళవారం 19 జనవరి 2021
Sports - Jan 11, 2021 , 09:13:58

సానియా మీర్జా భ‌ర్త‌కు త‌ప్పిన ప్ర‌మాదం

సానియా మీర్జా భ‌ర్త‌కు త‌ప్పిన ప్ర‌మాదం

ఇస్లామాబాద్ : టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా భ‌ర్త షోయ‌బ్ మాలిక్‌కు ప్ర‌మాదం త‌ప్పింది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయ‌బ్ మాలిక్ ప్ర‌యాణిస్తున్న కారు లాహోర్‌లో ఓ ట్ర‌క్కును ఢీకొట్టింది. అయితే ఈ ప్ర‌మాదం నుంచి స్వ‌ల్ప గాయాల‌తో మాలిక్ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. తాను సుర‌క్షితంగా ఉన్న‌ట్లు షోయ‌బ్ ట్వీట్ చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌(పీఎస్ఎల్‌-6) స‌మావేశానికి హాజ‌రై తిరిగి వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.