e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home News పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్‌

పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్‌

కార్డిఫ్‌: ఇంగ్లండ్‌తో తొలి వ‌న్డేలో దారుణంగా ఓడిన పాకిస్థాన్ టీమ్‌తో ఆడుకుంటున్నారు అక్క‌డి అభిమానులు. ట్విట‌ర్‌లో విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. ముగ్గురు ప్లేయ‌ర్స్‌కు క‌రోనా సోక‌డంతో అందుబాటులో ఉన్న ఓ సెకండ్ రేట్ టీమ్‌ను ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ సెలెక్ట్ చేసింది. దీంతో ఈ సిరీస్‌లో పాకిస్థానే హాట్ ఫేవ‌రెట్ అని అంతా భావించారు. కానీ తొలి వ‌న్డేలోనే ఆ టీమ్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. 36 ఓవ‌ర్ల‌లోపే కేవ‌లం 141 ప‌రుగుల‌కే పాక్ బ్యాట్స్‌మెన్ చాప చుట్టేశారు. ఈ టార్గెట్‌ను ఇంగ్లండ్ వికెట్ మాత్ర‌మే కోల్పోయి 21.5 ఓవ‌ర్ల‌లోనే చేజ్ చేసింది.

ఈ మ్యాచ్‌తోనే ఇంగ్లండ్ టీమ్‌లో ఏకంగా ఐదుగురు వ‌న్డేల్లో అరంగేట్రం చేయ‌డం విశేషం. బెన్ స్టోక్స్ సిరీస్ కోసం స్టాండిన్ కెప్టెన్‌గా ఉన్నాడు. అలాంటి టీమ్ పూర్తి బ‌లగంతో ఉన్న పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ ఓట‌మిని జీర్ణించుకోలేక‌పోయిన ఫ్యాన్స్‌.. ట్విట‌ర్‌లో పాక్ టీమ్ ప‌రువు తీశారు. కెన్యాతోనో, జింబాబ్వేతోనో సిరీస్ పెట్టుకోండని ఒక‌రు.. ఫుల్ స్ట్రెంత్‌తో ఉన్న ఇంగ్లండ్ టీమ్‌పై శ్రీలంక ఇంత‌కన్నా బాగా ఆడింద‌ని మ‌రొక‌రు ట్విట‌ర్‌లో కామెంట్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana